Facebook Twitter
శాంతిమంత్రం

ఓ మిత్రులారా ! ఇకనైనా

ఇలనైనా, మన కలలోనైనా

ఈ కంప్యుటర్ యుగంలోనైనా...

 

మన “కాళ్ళకు” నేర్పుదాం

కాంతి వైపే పయనించమని...

 

మన “ కళ్ళకు” నేర్పుదాం

కరుణ జాలి కురిపించమని...

 

మన “ నోళ్లకు” నేర్పుదాం

శాంతిమంత్రం జపించమని...

 

మన “వాళ్లకు” నేర్పుదాం

సమతావాదమే మన వేదమని...

 

"సహజీవనమే" మన నినాదమని

భిన్నత్వంలో ఏకత్వమే స్వర్గమని...

 

"స్నేహహస్తం, శాంతిచర్చలే", సకల 

సమస్యలకు చక్కని పరిష్కారమార్గాలని...