Facebook Twitter
ప్రజ్ఞ....ప్రతిభ.....ప్రశంసా.....

"పుట్టినరోజు పండగే అందరికీ...

మరి పుట్టింది ఎందుకో తెలిసేది

ఎందరికీ ఎందరికీ.....

కృషి ఉంటే మనుషులు

ఋషులౌతారు

మహా పురుషులౌతారు

తరతరాలకే తరగని నిధులౌతారు

ఇలవేలుపులౌతారు.....

 

సాధన చేయుమురా నరుడా

సాధ్యం కానిది లేదురా

అలవాటైతే విషమేఐనా

హాయిగా త్రాగుట సాధ్యంరా"..

అంటూ వీరులెవ్వరో...

విశ్వ విజేతలెవ్వరో...

విజయానికి దారులెన్నో ...

కనిపెట్టారు మనకవులెందరో...

 

అంటే, ఒక మనిషిని మహాత్ముడంటే...

ఆ మనిషిలో మానవత్వం ఉండాలి

ఒక వ్యక్తిని దేవుడుంటే...

ఎందరినో ఆపదలో ఆదుకొని ఉండాలి

ఒక వ్యక్తిని గొప్ప దాతంటే...

ఎన్నో గుప్తదానాలు చేసి ఉండాలి

ఒక వ్యక్తిని గొప్ప పండితుడంటే...

ఎన్నో బృహత్ గ్రంధాలను రచించిఉండాలి

ఒక వ్యక్తిని గొప్ప చిత్రకారుడుంటే...

ఎన్నో చిత్రాలను రవివర్మలా చిత్రించి ఉండాలి

ఎన్నో కళాఖండాలను సృష్టించి ఉండాలి

 

ఒక వ్యక్తిని మహాగాయకుడంటే...

ఒక ఘంటసాలలా ఒక బాలులా

ఎన్నో ఏళ్ళు కఠోరమైన

సంగీత సాధన చేసి వుండాలి

మరెన్నో మరచిపోలేని

మధురమైన గీతాలు ఆలపించి ఉండాలి

ఒక నటున్ని నటసార్వభౌముడంటే...

ఎన్నో చిత్రాలలో తన అద్వితీయ

నటనతో ప్రేక్షకులను అలరించి ఉండాలి

ఒక వ్యక్తిని గొప్ప మానవతావాదంటే...

మహత్తరమైన మానవీయ విలువలతో

ఎన్నోసత్కార్యాలు చేసి ఉండాలి

 

ఒక వ్యక్తిని గొప్ప ఉపన్యాసకుడంటే...

ఎన్నో సభలో సమావేశాల్లో

ఎన్నో గొప్ప గొప్ప ఉపన్యాసాలు

వివేకానందుడిలా చేసి ప్రేక్షకులను

ఉర్రూతలూగించి ఉండాలి

ఒక వ్యక్తిని కోటీశ్వరుడంటే...

ఎన్నో కోట్లు ఆర్జించి ఉండాలి

ఒక వ్యక్తి అఖండ విజయాన్ని

సాధించాడంటే...

ఎన్నో సార్లు ఓడి, గెలిచి, వుండాలి

 

ఒక వ్యక్తిని గొప్ప మేధావిఅంటే...

ఎన్నో వేల పుస్తకాలు చదివి ఉండాలి

ఎంతో అపారమైన

జ్ఞానాన్ని మేధస్సును కలిగిఉండాలి

ఒక వ్యక్తి గొప్ప సుందరమైన

శిల్పాలను చెక్కాడంటే...

ఆ వ్యక్తి నైపుణ్యం

ఆ వ్యక్తి శక్తి, ఆసక్తి అనంతమని అర్థం

ఒక రైతు పొలం నుండి ధాన్యం

ఇంటికి చేరిందీ అంటే ఆ రైతు

ఎన్ని నిద్రలేని రాత్రులను గడిపాడో చీకటిలో

ఎన్ని కన్నీటి చుక్కలను రాల్చాడో ఎవరికెరుక...

 

ఒకే వ్యక్తి...ఒక శక్తిలా... ఒక సైన్యంలా 

ఎంతో ఓర్పుతో... నేర్పుతో... సహనంతో 

బాహుబలిలా ఎన్నో భారీ కార్యక్రమాలను

నభూతో న భవిష్యత్ అనేలా నిర్విఘ్నంగా

నిర్వహించారంటే....

వారి ప్రచండ ప్రతిభ...అఖండ ప్రజ్ఞాపాటవాలు

అనన్యం... అనితరసాధ్యం... అనంతం

అట్టివారికి ఋణపడివుండాలందరు జీవితాంతం