మూలనపడివున్న "నా షూ"
నన్ను వేడుకుంటుంది తనను వాడుకోమని
సూర్యనికంటే ముందు లేస్తే సుఖపడతావని
మధురగీతాలతో "పక్షులు"అర్థిస్తున్నాయి
కిలకిలారావాలతో నన్ను మేల్కొల్ఫుతున్నాయి
నన్నుచూసి"నాపడక" పక్కుమని నవ్వుతుంది
నేను వేసుకున్న,గోడకు వ్రేలాడుతున్న
"నా హెల్త్ ప్లాన్లన్నీ, నా ఆరోగ్యసూత్రాలన్నీ"
వెర్రిచూపులు చూస్తూ,నన్ను వెక్కిరిస్తున్నాయి
ఉదయాన్నే నిద్రలేవగానే రమ్మని
వాకింగ్, జాగింగ్, వ్యాయామం, యోగా
చెయ్యమని, ప్రతి రోజూ
"పార్కు" నన్ను ప్రాధేయపడుతుంది
బద్దకస్తులందరూ బుద్దిహీనులని
తమకు తామే బద్ద శతృవులని
దీర్ఘాయుష్షుకు మూలం ఆరోగ్యమేనని
ఆరోగ్యం విలువ తెలియని
అజ్ఞానులందరూ ఆసుపత్రులను దర్శిస్తారని
ఆ చల్లని గాలి,ఆ పచ్చని చెట్లు
ఆ అందమైన ఆ ఆహ్లాదకర వాతావరణం
మన రుగ్మతలకు దివ్యఔషధాలని
యోగా గురువులు టీవీలో ఘోషిస్తున్నారు
చక్కని దివ్యమైన సందేశాలనందిస్తున్నారు
అవేవీ ఖాతరు చేయక నేను
గుడికెళ్ళాను కొబ్బరికాయలు కొట్టాను
దక్షిణ హుండీలో వేశాను
దైవదర్శనం చేసుకున్నాను
ఆ దైవం ముందరే నిలుచుని
ముఖిలితహస్తాలతో ఇలా వేడుకున్నాను
ఓ దైవమా ! నా ఇష్టదైవమా !
నాకు నాలుగు వరాలను ప్రసాదించు స్వామీ
ఆనందం - ఆదాయం - ఆరోగ్యం - దీర్ఘాయుష్షు
అప్పుడు నాకో "దివ్యవాణి" వినిపించింది
గర్భగుడిలోనే నాకు జ్ఞానోదయమైంది
పై నాలుగు వరాలు పొందాలంటే తప్పక
వాకింగ్ - జాగింగ్ - వ్యాయామం - యోగా
ఈనాలుగు తక్షణమే క్రమశిక్షణతో చేయాలని



