Facebook Twitter
రేపు వారు పెద్దవారైతే???

నేడు చిన్నపామునైనా సరే

పెద్ద కర్రతో కొట్టక వదిలేస్తే

రేపు పెద్దదై చాటుమాటుగా 

కాటేస్తుంది ప్రాణం తీస్తుంది

 

అందుకే అంటారు 

మొక్కనైనా మొగ్గనైనా 

ఆదిలోనే తుంచాలని 

పెద్దదైతే దాని కాండాన్ని

తుంచలేము వంచలేము

 

అలాగే పిల్లలనైనా ఎంత 

చిన్ననాడే తిట్టి కొట్టి

భయపెట్టి బెదిరించి

దారిలో పెట్టాలే కాని 

 

వారు పెద్దవారైతే మాత్రం

ఎవరి మాటలు వినరు

ఎవరినీ లెక్క చెయ్యరు

మేమింతే మాఇష్టమంటారు

 

వారు చెప్పిందే వేదం

వారు వ్రాసిందే శాసనం

అన్న పోలన్న సుభాషితం

విన్న మీకు శుభోదయం ఇది శుభ సందేశం