విధి ఆడే వింతనాటకం...
వండిన వంట
వంట చేసినవారికి చెందవచ్చు
చెయ్యని వారికీ చెందవచ్చు
పండిన పంట
విత్తనం వేసినవారికి చెందవచ్చు
వెయ్యని వారికీ చెందవచ్చు
కలిపిన జంట
పదికాలాలపాటు
పచ్చని కాపురం చేయవచ్చు
అది మూడునాళ్ళ ముచ్చట కావచ్చు
రగిలితే ఆకలి మంట
రామరాజ్యం రావణరాజ్యం కావచ్చు
రక్తపాతం జరగవచ్చు
అదికాలమే నిర్ణయిస్తుంది
ఏదిఏమైనా ఇది ఎవరికీ
అంతుపట్టని విధి ఆడే వింతనాటకం



