Facebook Twitter
అన్నం పరబ్రహ్మ స్వరూపం...

అవిగో అవిగో...

మ్రోగుతున్నాయి గుడిలోగంటలు

రెండు మనసులు ఒక్కటైనందుకు

రెండు కుటుంబాలు కలిసిపోయినందుకు

రెండు జంటలేకమైనందుకు ఒకలోకమైనందుకు

 

అవిగో అవిగో...

పండుతున్నాయి పచ్చని పంటలు

రేయింబవళ్ళు రైతులు కష్టపడినందుకు

రక్తాన్ని చెమట చుక్కలుగా మార్చినందుకు

రెక్కలుముక్కలు చేసి సేద్యము చేసినందుకు

 

అవిగో అవిగో...

మండుతున్నాయి ఆకలిమంటలు

రైతుల పంటలకు గిట్టుబాటు ధరల్లేనందుకు

వలసకూలీలకు కనీసవేతనాలు కరువైనందుకు

కార్మికులు,శ్రామికులు ఉపాధికోల్పోయినందుకు

 

అదిగో అవిగో...

వడ్డిస్తున్నారు వృధాచేస్తున్నా కమ్మనివంటలు

కడుపు నిండినవారే వచ్చినందుకు వివాహపు విందుకు

వీరు కళ్ళుతెరిచేదెప్పుడో నిరుపేదల కడుపు నింపేదెప్పుడో

అన్నం పరబ్రహ్మ స్వరూపమని వీరికి అర్థమయ్యేదెప్పుడో?