మరువరాదు మన కులదైవాన్ని.....
మీరు అన్నం తినేటప్పుడు
ఒక్కసారి... గుర్తుచేసుకోండి...
రెక్కలు ముక్కలు చేసే "ఆ బక్కరైతన్నలను"
మీరు ప్రశాంతంగా నిద్రపోతున్నప్పుడు
ఒక్కసారి... గుర్తుచేసుకోండి...
సరిహద్దుల్లో విశ్రాంతిలేని "ఆ వీరజవాన్లను"
మీరు కోర్టులో గెలిచినప్పుడు
ఒక్కసారి...గుర్తు చేసుకోండి...
లాజిక్ తో వాదించి గెలిపించిన"మీ లాయర్లను"
మీరు ప్రత్యర్థిని మట్టి కురిపించినప్పుడు
ఒక్కసారి ...గుర్తు చేసుకోండి...
జ్ఞానామృతాన్ని ప్రసాదించిన"మీ గురుదేవుళ్ళను"
మీరు గండాలనుండి గట్టెక్కిన్నపుడు
ఒక్కోసారి...గుర్తుచేసుకోండి...
మీకు కొండంత అండగావున్న "మీ మిత్రబృందాన్ని"
మీరేదైనా ఘోరమైన ప్రమాదంనుండి
సురక్షితంగా బయటపడినప్పుడు
ఒక్కసారి...గుర్తు చేసుకోండి...
మీకు రక్షణకవచమై మిమ్మల్ని రక్షించిన"ఆ కులదైవాన్ని"



