Facebook Twitter
చిరునవ్వువ్వే చిరుదీపం

ఒక ఐడియా జీవితాన్నే 

మార్చేస్తుంది అన్నది పచ్చినిజం 

కారణం ఒక చిన్న నిప్పురవ్వ 

కారడవినిదహించి వేస్తుంది 

ఒక చిన్నరంధ్రం వందల 

టన్నుల బరువైన ఓడను 

సముద్రగర్భంలో ముంచివేస్తుంది 

ఒక చిన్న చిరుదీపం 

చిమ్మచీకట్లను చీల్చివేస్తుంది  

వెన్నెలవెలుగుల్ని విరజిమ్ముతుంది 

సూక్ష్మ మైనవాటిలోనే

అత్యంత అనంతమైన 

అఖండమైన శక్తి దాగిఉంటుంది 

అన్నది నగ్నసత్యం

ఔను ఒక చిన్నచిరునవ్వు 

కోటిలోపాలను కప్పిపుచ్చుతుంది 

లెక్కలేనన్ని పనులు 

సక్రమంగా జరగడానికి 

చక్కని రాజమార్గం చూపుతుంది 

చీకటి కమ్మిన ఎన్నో 

ముఖాల్లో చిరునవ్వుల

జ్యోతులను వెలిగిస్తుంది 

రోజంతా ఉత్సాహంగా 

ఉల్లాసంగా ఆనందంగా 

పరమానందంగా సంతోషంగా 

గంతులు వేసేలా చేస్తుంది 

ఒక కొత్త శక్తినందిస్తుంది,అందుకే 

చిన్నగా నవ్వు...చిరునవ్వు నవ్వు

నవ్వుతూ ఉండు...నలుగురిలోఉండు 

నలుగురికి...నవ్వులు...పంచుతూ వెళ్ళిపో