Facebook Twitter
ఎందుకు? భయమెందుకు?....

ప్రతిరోజూ ప్రభాతవేళ 

పక్కా ప్రణాళికతో పదిమెట్లు "ఎక్కడం" మేలు

 

లక్కీగా చిక్కిన వర్క్ ఫ్రం హోం టైంలో 

వీలుచూసుకుని సైకిల్ "త్రొక్కడం" మేలు

 

నాలుగు రోజులు కరోనాకు 

చిక్కకుండా ఎక్కడైనా "నక్కడం" మేలు

 

కరోనాను ఖతం చెయ్యమని 

ఆ ముక్కోటి దేవతలకు "మ్రొక్కడం" మేలు

 

ఎందుకు? భయమెందుకు?

"ఆశే" శ్వాసగా సాగిపో ముందుకు...

 

ఎందుకు? భయమెందుకు?

"సాహసమే" ఊపిరిగా సాగిపో ముందుకు...

 

ఎందుకు ? భయమెందుకు?

"దైర్యమే" ఆయుధంగా అడుగులెయ్ ముందుకు...

 

భయపడితే బ్రతకలేము, భయపడితే మన వెనుకే

వెంటాడే పులులుంటాయి,వేటాడే సింహాలుంటాయి 

కరోనాలాంటి తరిమే తోడేళ్ళుంటాయి తస్మాత్ జాగ్రత్త

 

భయపడే పిరికి పందకు ప్రతిరోజు మరణమే

ధైర్యవంతుడికి బుద్దిశాలికి మరణంమాత్రం ఒక్కసారే