Facebook Twitter
దుస్కర్మలు ముంచు దుఖసాగరంలో....

కనిపించని 

ఈ కాలచక్రభ్రమణంలో

క్షణాలు నిముషాలుగా

నిముషాలు గంటలుగా 

గంటలు వారాలుగా

వారాలు నెలలు‌గా 

నెలలు సంవత్సరాలుగా

ఓ సుర్యోదయం 

సూర్యాస్తమయంలా

ఓ పగలు రాత్రిలా

ఓ పౌర్ణమి అమావాస్యలా మారడం

ప్రకృతి ధర్మం సృష్టి మర్మం

నిన్నటిదాకా నిత్యం పలకరించిన

పాతక్యాలెండర్లు కొత్త పెళ్ళికూతుర్లుగా

ముస్తాబబై మనల్ని మురిపించవచ్చు

 

ఈ జీవితనయాత్రలో

మన సకర్మల దుస్కర్మల 

ఫలితాలు మాత్రం మారవు

అవి శిలాక్షరాళ్ళలా చెక్కుచెదరవు

 

ఒక "చెడుపని" కనపడని

"ఒక కాలసర్పమై" మనల్ని 

కాటు వేస్తూనే వుంటుంది

"ఓ వేటకుక్కలా" మనల్ని

వేటాడుతూనే వుంటుంది

"ఓ వేటకొడవలై" మన మెడపై

వ్రేలాడుతూనే వుంటుంది

"ఒక తీరని శాపమై" మనల్ని

వెంటాడుతూనే వుంటుంది

 

ఐతే ఒక "మంచిపని" మాత్రం

"ఒక కన్నతల్లి చల్లనిఒడిలా"

"ఓ కోడి రెక్కలా కంటికి రెప్పలా"

కనపడని "ఒక రక్షణకవచంలా" మనల్ని

అడుగడుగునా కాపాడుతూనే వుంటుంది

 

ఎవరు ఔనన్నా కాదనైనా ఇది పచ్చినిజం

ఈ ఆశలఆరాటంలో ఈ జీవనపోరాటంలో...

సకర్మలు ముంచు సంతోషసాగరంలో...

దుస్కర్మలు ముంచు దుఖసాగరంలో...