Facebook Twitter
మాటే మంత్రం....మనసే బంధము....

ఓ మంచిమాట...

తేనెకన్న ఎంతో తియ్యన...

మంచుకన్న ఎంతో చల్లన..

 

మధురమైన 

మంచిమాటలే ఊరించే ఊటలు 

పరిమళించే పూదోటలు 

మురిపించే ముత్యాల మూటలు

 

మీనోటిమాట వెన్ననా? తేనెనా?

అమృతమా? విషమా? 

తప్పా? ఒప్పా?ఉప్పా?నిప్పా? కారణం?

కఠినమైన మాటలే కంటిలో కారాలు

ప్రక్కలో బల్లాలు గుండెల్లో గునపాలు 

 

ఘాటైన ఓమాట మదిని గాయపరుస్తుంది

కఠినమైన మాట కత్తిలా గుచ్చుకుంటుంది

గాయపడిన మనసుకు ఎక్కడ ప్రశాంతత ?

 

ప్రశాంతతే కరువైతే బ్రతుకు శూన్యమే

బ్రతుకు శూన్యమైతే జీవితం ప్రశ్నార్థకమమే

 

అందుకే ఆలోచించండి ఆపైనే మాట్లాడండి !

మిత్రులారా మరువకండి ! నాఈ మంచిమాట