Facebook Twitter
పోరాడితే పోయేదేముంది

మీ బానిసత్వం తప్ప?...

 

బావిలో కప్పల్లాగ  

గుడ్డిగా దూకే గొర్రెల్లా

ఆకులు మేసే మేకల్లా 

తోకలు ఊపే కుక్కల్లా

బెదురు చూపుల జింకల్లా 

గొడ్డు చాకిరి చేసే గాడిదల్లా

పంజరాల్లోపక్షుల్లా బ్రతక్కండి

 

గర్జించే సింహాల్లా 

గాండ్రించే పులుల్లా

బుసలు కొట్టే కోడెనాగుల్లా 

ఘీంకరించే మదపుటేనుగుల్లా

ఎగిరే తారా జువ్వల్లా 

రగిలే నిప్పురవ్వల్లా బ్రతకండి

 

ఆధారపడినంత కాలం మీరు అనాధలే....

అడుగునుండే బడుగు బలహీనవర్గాలే

అణగారిన అణద్రొక్కబడిన అమాయకులే....

ఓ పీడిత తాడిత ప్రజల్లారా !పిడుగుల్లా మారండి ! 

కదం తొక్కండి!పిడికిలి బిగించి ముందుకు దూకండి !

 

ప్రచండశక్తితో ప్రతిఘటించండి !పులుల్లాగ పోరాడండి.!

పోరాడితే పోయేదేముంది?వెయ్యేళ్ళ మీ బానిసత్వంతప్ప

కానీ తప్పక వస్తుంది ఈ సంఘంలో మీకు సమానత్వం 

 

మరవకండి మరువకండి కలనైనా మరవకండి....

ఆకులు మేసే అమాయకపు మేకల్నితప్ప... 

పులుల్ని సింహాల నెవరూ పూజకు బలివ్వరన్న...

అంబేద్కర్ అమృతవాక్కుల్ని కలనైనా మరవకండి..........