Facebook Twitter
చాలా చాలు బానిస బ్రతుకు 

దగాపడ్డ ! ఓ దళితబిడ్డా! 

చాలా చాలు నీ మొద్దునిద్ర 

ఇకనైనా మేలుకో

ఈ కంప్యూటర్ యుగంలోనైనా 

కళ్ళు తెరుచుకో 

 

దగాపడ్డ ! ఓ దళితబిడ్డా! 

చాలా చాలు నీ బానిస బ్రతుకు 

ఇకనైనా నీ సంకెళ్ళు త్రెంచుకో 

స్వేచ్ఛగా జీవించండం నేర్చుకో 

 

దగాపడ్డ ! ఓ దళితబిడ్డా! 

చాలు చాలు ఇంతకాలం 

అజ్ఞానాంధకారంలో మ్రగ్గిపోయావు 

ఇకనైనా విద్యకున్న,విలువను 

తెలుసుకో విజ్ఞానాన్ని పెంచుకో 

 

దగాపడ్డ ! ఓ దళితబిడ్డా! 

చాలా చాలు ఇంతకాలం 

పరోపకారమంటూ సైలెంటుగా

సెర్వెంటుగా నీ యజమానికి

నమ్మిన బంటుగా బ్రతికావు 

ఇకనైనా నీ భాష మార్చుకో

బాస్ గా క్లాస్ గా బ్రతకడం నేర్చుకో 

 

దగాపడ్డ ! ఓ దళితబిడ్డా ! 

చాలుచాలు ఇంతకాలం 

జాలిపడి జండాలు మోస్తూ

పాలితుడిగానే మూలన పడిఉన్నావు 

ఇకనైనా మంచి పాలకుడిగా మారిపో

 

అందుకే,దగాపడ్డ ! ఓ దళితబిడ్డా !  

అంబేద్కర్, పూలేల అమృత వాక్కుల్ని 

నిత్యం మదిలో "స్మరించు" మంచిని "బోధించు" 

మందిని "సమీకరించు" నీ హక్కులకై "పోరాడు" 

రక్తతర్పణ చేసైనా సరే రాజ్యాధికారం "సాధించు