తప్పక తెలుస్తుంది?
కొనేవారికి ...ధర తెలుస్తుంది
తినేవారికి ...రుచి తెలుస్తుంది
వినేవారికి ...విషయం తెలుస్తుంది
చేసే వారికి ... శ్రమ తెలుస్తుంది
చూసే వారికి ...నిజం తెలుస్తుంది
మోసే వారికి ...బరువు తెలుస్తుంది
మొక్కేవారికి ...భక్తి తెలుస్తుంది
మెక్కే వారికి ...రుచి తెలుస్తుంది
ఎక్కే వారికి ... ఎత్తు తెలుస్తుంది
తొక్కే వారికి ...దూరం తెలుస్తుంది
అడిగేవారికి ... అవసరం తీరుతుంది
తట్టేవారికి ... తలుపు తెరుచుకుంటుంది
వెతికేవారికి.....తప్పక గొప్పనిధి దొరుకుతుంది
దానం చేసేవారికి ...పుణ్యం దక్కుతుంది
బడికి వెళ్లే వారికి ...విజ్ఞానం పెరుగుతుంది
గుడికి వెళ్లే వారికి ...దైవదర్శనం జరుగుతుంది
ఇది నిజం ...మూటికి ముమ్మూటికి పచ్చినిజం



