పైరులాంటి పచ్చనిజీవితం....
మన బ్రతుకును
పచ్చదనం పలకరించాలంటే
ముందు మన మనసెప్పుడూ
పైరులా పచ్చగా....
మల్లెలా స్వచ్ఛంగా...
మంచులా చల్లంగా... ఉండాలి
మన హృదయంలో
ప్రేమ ప్రవహించాలంటే
ముందు మన ఆలోచనలెప్పుడూ
నిష్కల్మషంగా...నిష్పక్షపాతంగా...
అమ్మా పాలలా స్వచ్చంగా...
ఓ జీవనదిలా నిర్మలంగా...
నిశ్చలంగా... ఉండాలి
మన జీవితాన
ప్రశాంతత ప్రకాశించాలంటే
మనం తలపెట్టిన కార్యాలెప్పుడూ
నీతిగా...నిజాయితీగా... ఉండాలి
మనం నిప్పులా మండుతూ...ఉండాలి
అప్పుడు మన జీవితంలో
ఎప్పుడూ........ పచ్చదనమే....
ఎప్పుడూ..... ప్రశాంతతే
ఎప్పుడూ ........సుఖమూ శాంతే...
ఎప్పుడూ ఆనందమే...పరమానందమే...కానీ
పచ్చదనం... ప్రకృతి వరం
ప్రశాంతత.... భగవంతుని బహుమానం



