1
గాలిని పట్టుకోలేరు
నిప్పును ఎవరూ ముట్టుకోలేరు
మూటకట్టుకోలేరు
ప్రతిభనెవ్వరూ ప్రక్కకు నెట్ఠలేరు
2
గతం గాయాలమయం
వర్తమానం వరాలమయం
అనుక్షణం అమృతమయం
భవిష్యత్తు భయాలమయం
3
భయపడుతూ ప్రేమించుకునే
వాళ్లే బలిపశువులౌవుతారు
ముందుగా ప్రేమను వ్యక్తం చేయలేని
మూగ ప్రేమికులంతా మూర్ఖులే
వారు రెక్కలున్నా ఎగరలేని పక్షులే
వారి ముందు జీవితం ముక్కలు చెక్కలే
4
గాడిదకేం తెలుసు గంధం విలువ
గబ్బిలానికేం తెలుసు వెలుగు విలువ
గుడ్డివాడికేం తెలుసు గులాబీ విలువ
ఓడినవాడికేం తెలుసు విజయం విలువ
మందబుద్దికేం తెలుసు మహాభారతం విలువ
5
రాళ్ళు విసరలేడు
గాజు గదిలో ఉన్నవాడు
గాడాంధకారంలో నిలుచున్నాడు
పంజరంలో ఉన్న పక్షి పైకి ఎగరలేదు
గడిచిపోయిన కాలం
జరిగిపోయిన అవకాశం
తొందరపడి మాట్లాడినమాట తిరిగిరావు
6
కడుపు రగిలి
గుండె పగిలి
మనసు విరిగి
బ్రతుకు నలిగితే
చివరకు నీవు చితికె
సంపద ఉంటే సంతోషం ఉండదు
సంతోషంగా ఉంటే సంపద ఉండదు
అందుకే పెంచుకున్న సంపదను పంచిపో
7
దేనికి విలువ ఇవ్వాలి
దేని మీద మనసును నిలువని ఇవ్వాలి
అని తెలుసుకుంటే చాలు
సమస్య సగంపాలు పరిష్కారమైనట్లే
సక్సెస్ సగం దక్కినట్లే
8
ధన్యవాదాలు తెలిపేందుకు
రెండు చేతులు జోడించాలి
పెదవులపై చిరునవ్వును చిలకరించాలి
కళ్ళు కరుణను కురిపించాలి
కనిపించని హృదయం
ఆనందంతో పరవశించాలి
మనసు గంగానదిలా గంతులు వెయ్యాలి
9
డు ఆర్ డై
ఎదురీదు లేదా
ఏదైనా ఏట్లో దూకిచావండి
సమస్యలను ఎదుర్కోండి
లేదా వాటికి లొంగిపోండి
ఎదుర్కొంటే విజయంతో పొంగిపోతారు
లొంగిపోతే మాత్రం లోలోన
కుమిలిపోతారు కృంగి పోతారు
10
సగం సమస్యలు
సంకోచాల వల్లే పుడతాయి
మనస్థాపం మంచిది కాదు
మంచి సంబంధాల కోసం
వంతెనలను నిర్మించాలి
వంచనాగుణాన్ని నిర్మూలించాలి
అపార్థాలనే అడ్డుగోడల్ని లేపకూడదు
అనుమానాలనే విషబీజాలను నాటకూడదు
సంకోచమనే విషపూరిత విత్తనంనుండి
పుట్టి వేపుగా పెరిగే వెర్రమర్రిమానే మనస్తాపం
11.
అభివృద్ధి చెందరా శిష్యా అంటే
అడుక్కుతింటా గురూ అన్నాడట ఓ బద్దకస్తుడు
అధిరోహించరా ఎవరెస్ట్ శిఖరమంటే
అథఃపాతాళానికి పోతానన్నాడట ఓ సోమరిపోతు
మాటవినని లెక్కచేయిని సన్యాసులకు
మూర్ఖులకు ఉచిత సలహాలివ్వడం తప్పే
ఎంత చెప్పినా విననివారి చేతికి చివరికి చిప్పే



