వీరిలో.... మీరెవరు?....(మీనీకవిత)
"బలహీనులే"...
పగతో ప్రతీకారంతో
నిత్యం రగిలిపోతూ వుంటారు
"బలవంతులే"...
అన్నీ భగవంతునికి వొదిలేస్తారు
క్షమాగుణాన్ని కలిగి వుంటారు
"దాతృత్వగుణం గలవారే"...
ఆకలితో అలమటించే
అనాధలకోసం అన్వేషిస్తూ వుంటారు
"సేవాతత్పరులే"...
చెయ్యగలినంత సహాయం
చెయ్యడానికి సదాసిద్ధంగా వుంటారు
"నిస్వార్థపరులే....
నిరుపేదల శ్రేయస్సుకోసం
నిరంతరం మనసులో తపిస్తుంటారు
"విజ్ఞులే వివేకవంతులే"
ఎంతటి విపత్తునైనా తట్టుకుంటారు
ఎంతటి విషాదాన్నైనా దిగమింగుతారు
"స్థితప్రజ్ఞత గలవారే"...
ఎంతగా విమర్శించినా
ఎంతగా విషాన్ని చిమ్మినా
విస్మరిస్తారు,చిన్న చిరునవ్వు నవ్వి
విస్మయం చెందరు.....విచారించరు
మరి వీరిలో.... మీరెవరు?............



