Facebook Twitter
జీవితమంటే ?గెలుపు - ఓటమిల ఆట....

ఈ జీవితం ఒక గొప్ప సవాల్

మనిషి తనకు తాను పరిసరాల

ప్రభావాన్ని బట్టి ప్రవర్తనను మార్చుకోవాలి

ఎవరెస్టు శిఖరమంత ఎత్తుకు ఎదగాలి

 

ఏదీ తనంత తానే మన దరికి రాదని...

శోధించి సాధించాలని,అదే ధీరగుణమంటూ

చీకటిలో చిరుదీపం వెలిగించమన్నాడు శ్రీశ్రీ

 

ఎవరి జీవితం వడ్డించిన విస్తరి కాదు

ఎవరికివారే కావలసినవి వడ్డించుకోవాలి

 

కొందరు తమలో ఎంతో టాలెంట్ ఉన్నా

ఏదో లోపం ఉందనుకుంటూ

తమ ప్రగతిని తామే అడ్డుకుంటారు

 

"నా కర్మ, నా రాత" అనుకోరాదు,

అపజయాలను అంగీకరించక

ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి

ఎవరికివారే తమ తలరాతను తామేరాసుకోవాలి

 

అపజయాలనే అవకాశాలుగా భావించి

సమస్యల అడ్డుగోడలను ఆత్మస్థైర్యంతో

అధిగమించాలి" అద్భుతాలు" సాధించాలి

 

"ఓపిక" ఉన్నంతవరకు కాదు కాదు

"ఊపిరి" ఉన్నంతవరకు పోరాడాలి

"ఆత్మ విశ్వాసం"నీ చేతిలో ఆయుధం కావాలి

 

ఓ మిత్రమా సాహసంతో ముందుకు సాగితే

"ఓటమి" నీ పాదాలకింద మట్టవుతుంది...

"గెలుపు" నీ శిరస్సుకు కిరీటమవుతుంది