Facebook Twitter
కారు చీకటిలో సైతం...

నీ కళ్ళు నవ్వుతూ ఉంటే...

చింతలు చీకాకుల్లో సైతం

నీ చిత్తం చిందులేస్తూంటే...

 

అంతులేని

అవాంతరాలెన్నిదురైనా

నీ ఆత్మస్థైర్యం సడలకుంటే...

 

మిన్ను విరిగి మీద పడిన సరే

నీ వెన్నుపూసలో

వణుకు పుట్టకుంటే...

 

కష్టాల కత్తులు లోతుగా

గుచ్చుకుంటున్నా సరే

నీ కంట కన్నీరే రాకుంటే...

 

ఓ మనిషి నీకిక తిరుగేలేదు

నీ మనుగడకు దిగులే లేదు 

 

నీ జీవితం

నిజంగా

నవవసంతం

నీ బ్రతుకు ప్రతినిత్యం...

నవరసభరితం ఇది నగ్నసత్యం