ఆశయాలు ఆరనిదీపాలు...
ఎక్కడైతే ప్రజలు నిర్భీతితో
ప్రశాంతంగా నిద్రిస్తున్నారో
ఎక్కడైతే సుపరిపాలన
సవ్యంగా సాగుతుందో
ఎక్కడైతే యుద్దభీతన్నదిలేదో
ఎక్కడైతే అల్లర్లు అణచివేతలు
అరాచకాలు అక్రమాలు అకృత్యాలు
హింస ప్రతిహింసలు విషపు కోరలు చాసే
విద్వేషాల విషసర్పాల విధ్వంసాలుండేవో
అక్కడ అంబేద్కర్
ఆశయాలు ఆరనిదీపాలే
అక్కడ అంబేద్కర్ కార్చిన
చెమట చుక్కలింకా ఆరనట్లే
అవి అమరజీవి అంబేద్కర్ కన్న
కమ్మని కలలకు ప్రతిరూపాలే, అవి
వారు నిదురపోనిరాత్రులకు నిదర్శనాలే
భారతీయుల అపూర్వ నిధిగా
తరతరాలకు తరగని సంపదగా
ప్లపంచ మేధావులచే ప్రశంసింపబడిన
రక్షణకవచమైన రాజ్యాంగాన్ని
మనకు అందించిన
ఆ దళితనేత...
ఆ అపరమేధావి....
ఆ స్పూర్తి ప్రదాత....
ఆ రాజ్యాంగ నిర్మాత...
అమరజీవి అంబేద్కర్...
స్మరణ ప్రతిఒక్కరికి ఒక ప్రేరణే.....



