Facebook Twitter
సమాజంలో మార్పు రావాలంటే...

సమాజంలో మార్పు రావాలంటే...

బలహీనులకు ధైర్యం నూరిపోయాలి

అజ్ఞానులను చైతన్యవంతం చెయ్యాలి

నిరుపేదలకు,కూలీలకు, శ్రమజీవులకు

దోపిడీని గురించి అవగాహన కలిగించాలి

అన్నపోలన్న సుభాషితం విన్న మీకు శుభోదయం

 

సమాజంలో మార్పు రావాలంటే...

ముందు మధ్యతరగతి వారిలో మార్పు రావాలి

వారెంతటి శక్తిస్వరూపులో వారికి తెలియజేయాలి

ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురుచూడరాదు

నమ్మితే నరకమని,స్వశక్తియే స్వర్గమని తెలియాలి

అన్నపోలన్న సుభాషితం విన్న మీకు శుభోదయం

 

సమాజంలో మార్పు రావాలంటే...

ధనవంతులంరూ ఆస్తి అంతస్తుల మీద ఆసక్తి ఉన్నా

నాదినాది అనుకున్నదేదీ నీదికాదన్న నిజంతెసుకోవాలి 

సేవాగుణం, కలిగివుండాలి,దయాగుణం దాతృత్వం

మంచితనం, మానవత్వం, మచ్చంటూలేని వ్యక్తిత్వం

అన్నపోలన్న సుభాషితం విన్న మీకు శుభోదయం

 

సమాజంలో మార్పు రావాలంటే...

కులాలు,మతాలంటూ కుమ్ములాటలుండరాదు

ప్రజలను,ప్రభుత్వాలు ఓట్లకోసమే వాడుకోరాదు

ప్రజా సంక్షేమమే పునాదిగా సుపరిపాలన సాగాలి

ప్రజలందరు సమానత్వం సౌభ్రాతృత్వంతో మెలగాలి

అన్నపోలన్న సుభాషితం విన్న మీకు శుభోదయం