నిస్వార్థమైన జీవితం
ఓ మిత్రమా !
అకారణంగా ఎవరినీ
ఎప్పుడూ ద్వేషించకు
బాధపడకు భయపడకు
సాదాగా సరదాగా జీవించు
కొద్దిగా ఆశించు కొండంత కాదు
అడిగితే ఇవ్వలేనంతకాదు
ఆశకు హద్దుండాలి
అడిగే అర్హత ఉండాలి
ఎంత ఎత్తుకు ఎదగగలిగితే
అంత ఎత్తుకు ఎదుగు
ఎంత ఇవ్వగలిగితే అంత ఇవ్వు
కాని,ఉన్నదంతా ఊడ్చివ్వకు
ఎప్పుడూ నీ ముఖంలో
చిరునవ్వు ఒక మొక్కలా
చిగురిస్తూ వుండాలి
ముఖమంతా ఒక దివ్వెలా
వెలుగుతూ వుండాలి
హృదయమంతా
ఒక గులాబీ పువ్వులా
గుభాళిస్తూ వుండాలి
నీ వెప్పుడూ నీకు
ప్రాణం పోసిన పరమాత్మను
జన్మనిచ్చిన అమ్మానాన్నలను
జ్ఞానం అందించిన గురువులను
నిత్యంగుర్తు చేసుకుంటూ ఉండాలి
ఇలనైనా కలనైనా మరువకూడదు...
అప్పుడు ఇక నీ జీవితమే
జలజలా దూకే జలపాతమే
గలగలపారే గంగా ప్రవాహమే
అంతేలేని సంతోషాల సాగరమే
సుఖాల సుందర నందనవనమే



