Facebook Twitter
మీ జీవితానికి మీరే కర్తలు....

పాలను పితకకుండ 

పాలకుండ పట్టుకొని, 

గేదె ఎదురుగా నిలబడి, 

పాలివ్వు పాలివ్వు మంటే 

ఏ గేదె నీకు పాలు ఇవ్వదు

 

అలాగే నీవు దైవం ముందు నిలుచొని 

ఓ దేవా నా ప్రార్థన విను,నా కోరికలు తీర్చమంటే 

ఏదైవం నీ ప్రార్థన వినడు నీ కోరికలు తీర్చడు

 

ఆ గేదె నీది కాబట్టి నీవే పాలు పితుక్కోవాలి

త్రాగి తృప్తి చెందాలి  అమ్మి లాభం పొందాలి

ఆ దైవం నీకు అన్నీ అవయవాలిచ్చాడు గనుక

నీవే నీ కార్యాన్ని నిర్వర్తించాలి,ఫలితం పొందాలి

 

అదెలాగంటే....

నీ గురువు నీకు చక్కగా పాఠాలు బోధించాడు

విజ్ఞానాన్ని అందించాడు బ్రతుకు దారి చూపాడు

కాబట్టి నీవే పాఠాలు శ్రద్దగా చదివి ,పరీక్షలు వ్రాసి

మంచి మార్కులు లేదా ర్యాంకులు తెచ్చుకోవాలి

 

మీ అమ్మానాన్నలు వెతికి వెతికి 

మీకు చక్కటి సంబంధాలు చూశారు

అప్పులెన్నో చేసి ఘనంగా పెళ్ళి చేశారు

కాబట్టి మీ కాపురాన్ని మీరే నిలబెట్టుకోవాలి 

మీ పచ్చని సంసారంలో కారుచిచ్చు రేగకుండా

మీకు మీరే గుట్టుగా కాపురం చేసుకోవాలి

వారి బాధ్యత ముగిసింది ఇక నీ కర్తవ్యమే మిగిలింది