ఔరా..! పరమపవిత్రమైన ప్రసాదం
నేడు రాజకీయమాయెనే..! కానీ ఎవరికీ
అంతుచిక్కని చిక్కుముడి ఒక్కటే...
పకడ్బందీగా అన్ని పరీక్షలు జరిగాక...
కల్తీనెయ్యి ట్యాంకర్లను తిరస్కరించాక...
ఇక "జంతువులకొవ్వు"వాడకమెక్కడ?
"లక్షల లడ్లు" తయారైందెక్కడ ?
"తిరుమలలో భక్తులు తిన్నదెక్కడ..?
ఎవరో ఏ స్వార్థ పూరిత రాజకీయ లబ్దికోసమో పరమపవిత్రమైన శ్రీవారి ప్రసాదాన్ని
"రాజకీయం" చేయడం
కోట్లాది మంది భక్తుల మనోభావాల్ని
దెబ్బతియ్యడం ఎంతటి అపచారం..?
ఎంతటి ఘోరం..? ఎంతటి నేరం..?
ఎంతటి పాపం..? ఎంతటి శాపం..?
అట్టి "ఘోర అపచారానికి"
"అబద్ధపు ప్రచారానికి" ఒడిగట్టి
కల్తీ రాజకీయాలు చేసే ఓ నేతలారా..!
కళ్ళుమూసుకొని పాలుత్రాగే
ఓ పిల్లుల్లారా..! ఊసర వెల్లుల్లారా..!
గర్భగుడిలో కోనేటి రాయుడున్నాడు...
కోటి కళ్ళతో వీక్షిస్తున్నాడు జాగ్రత్త..!
ఓ దోషులారా..!దొంగల్లారా..!ఇక శ్రీవారు
విధించే శిక్షకు అగ్ని పరీక్షకు సిద్ధం కండి..!



