సృష్టికర్త
ఒక గొప్ప
చిత్రకారుడే...
వర్ణనాతీతం...
ప్రకృతి అందాలే...
పులకించి
పోవలసిందే...
ఆ ఉషోదయం...
ఆ సంధ్యా సమయం...
తిలకించి...ఎవరైనా
ఆ నీలాల నింగిలో
ఆ నీలి మేఘాలను...
ఎత్తైన ఆ వృక్షాలను...
బారులు తీరి ఎగిరే ఆ
పక్షుల గుంపును వీక్షిస్తుంటే..?
ఎంతటి ఆహ్లాదకరం..!
ఎంతటి ఆహ్లాదకరం..!
ఎత్తైన కొండల నుండి
జలజల దూకే
ఆ జలపాతాలను...
గలగల పారే ఆ సెలయేర్లను...
నిశ్చలంగా...నిర్మలంగా
ప్రవహిస్తూ నవ్వే ఆ నదుల
అందాలను వర్ణించుట
ఏ కవి తరమౌను...?
ఏ కవి తరమౌను...?
కొండలు కోనలు...
లోతైన లోయలు...
ఎత్తైన పర్వతాలు...
సువిశాలమైన
ఆకుపచ్చని ఆ మైదానాలు...
ఎంత చూసినా తనివి తీరదే..!
పచ్చదనం...
ప్రశాంతతే...
ప్రకృతి అంటే..!
ఎంత హాయి అవి
మన జీవితంలో ఉంటే..!
ఈ ప్రపంచాన్ని ఈ ప్రకృతిని
ఇంత సుందరంగా తీర్చిదిద్ది
నరులారా..! నా వారసులారా..!
ఆనందించండి..!
అనుభవించండి..!
ఆరోగ్యంగా ఉండండి..!
సుఖశాంతులతో జీవించండని..!
తరతరాలకు తరగని
ఉచితంగా ఇన్ని వరాలను
ఉత్కృష్టమైన ఈ మానవ
జన్మనిచ్చిన ఆ పరమాత్మ
మన నుండి కోరేది ఒక్కటే ...
కొంచెం
దయా దాక్షిణ్యం...
కొంచెం దాతృత్వం...
కొంచెం మంచితనం మానవత్వం...
ప్రతిగుండెలో కొంచెం ప్రేమతత్వం...అంతే



