నిన్న...
మా ఊరి
కోళ్ల ఫారంలో
తెల్లని కోళ్ళు"తెల్లగుడ్లు"
నల్లని కోళ్ళు "నల్లగుడ్లు"
ఎర్రని కోళ్ళు "ఎర్రగుడ్లు"
పెడుతున్నాయట..!
నమ్మశక్యంగా లేదు కదూ
కానీ ఇది నమ్మక తప్పదే..!
"కోళ్ళు" కల్తీ...
"కోళ్ళ దానా" కల్తీ...
"కోడి గుడ్లు" కల్తీ...
కారణం ఇది కలికాలం...కల్తీ కాలం..!
ఔను...
ఇదెంత వింత విచిత్రం...
నేడు పరమ పవిత్రమైన
తిరుమల తిరుపతి లడ్ల
"రంగు రుచి వాసన"మారెనట..!
"రంగూ" రాజకీయమాయెనట..!
"రుచీ" రాజకీయమాయెనట..!
"సువాసనా" రాజకీయమాయెనట..!
కారణం ఇది కలికాలం...కల్తీ కాలం..!
ఓ కలియుగ దైవమా...!
మమ్మల్ని క్షమించండి..!
మీ గుడి చుట్టూ భారీ ప్రాకారాలే...
మీ ప్రసాదం చుట్టూ కల్తీ రాజకీయాలే...
భక్తులందరి విశ్వాసమొక్కటే...
"కల్తీ" ప్రసాదంలో కాదు...అది
అవినీతి రాజకీయ నాయకుల
అంతరంగాల్లో...దుష్టతలంపుల్లో...
అందుకే
ఏడుకొండలెనెక్కి...
ఆ వెంకటేశ్వరుని
వేడుకునేది ఒక్కటే..!
పవిత్రమైన గంగానదిలా మా
నేతల "బుద్ధిని శుద్ధి" చేయమని..!
ఆ కోనేటి రాయునికి మ్రొక్కి...
కొండంత ఆశతో కోరుకునేది ఒక్కటే..!
"పవిత్రమైన ప్రసాదం" చుట్టూ తిరిగే ఈ "కల్తీ" రాజకీయాల్ని ప్రక్షాళన చేయమని..!



