ప్రకృతి అందాలకు నిలయమైన
పర్యాటకుల స్వర్గ సీమ కేరళలో
వయనాడ్ జిల్లాలో అందమైన అతిసుందరమైన మండక్కై మెప్పడి
చూరాల్ మల్ కొండప్రాంతాల్లో
విరుచుకు పడిన కొండచరియలు..!
వరదలో బురదలో కూరుకుపోయి
అమాయకపు ప్రజల ఆర్తనాదాలు..!
అయ్యో అయ్యో..!
ఎందుకింతటి ఘోరం..?
ఏమిటి వారు చేసిన నేరం..?
అయ్యో అయ్యో..!
ఇది ఏ అతీంద్రయశక్తి శాపం..?
ఏమిటీ ఆ పల్లెప్రజలు చేసిన పాపం..?
అయ్యో అయ్యో..!
ఏమీటి ఈ దారుణమారణహోమం..?
ఎందుకు వారికీ అకాలమరణం..?
ఇది ఏ విషనాగు విశ్వరూపం..?
ఆరిపోయె పాపం ప్రతి ఇంటదీపం...!
తేది 29.07.2024
సోమవారం అర్థరాత్రి ఏం జరిగింది..?
ఎవరు వ్రాశారు వారికి మరణశాసనం..?
ఎందుకు ప్రకృతి వికృతరూపం దాల్చింది?
ఎందుకు దైవ భూమి
మరుభూమిగా మారింది..?
ఎందుకు కుండపోతగా
కుంభవర్షం కురిసింది..?
ఎందుకు ప్రశాంతంగా నిదురించే
పల్లె కుటుంబాలపై కొండరాళ్ళను పిడుగులుగా విసిరింది..?
ఎందుకు కొండ చరియలు
కోపంతో విరుచు పడ్డాయి..?
నిజమేనా ప్రకృతి పగబడితే
నరుడు బ్రతుకు నరకమేనా..!
ఔను పచ్చని చెట్లనరికి వేత...
మైనింగ్...క్వారీ...ఇసుక త్రవ్వకాలు
థర్మల్ పవర్ ప్రాజెక్టుల...
భారీ టౌన్ షిప్పుల నిర్మాణాలిక నిషిద్ధం..!
ఓ నరుడా చేయకు ప్రకృతితో యుద్ధం..!
భూకంపాలు...భూతాపాలు...
పాలకుల పాపాలే...ప్రకృతి శాపాలు....!
తెరవాలిక ప్రతిఒక్కరు తమ జ్ఞాననేత్రం !
పర్యావరణ పరిరక్షణే సుఖజీవన సూత్రం !
కావాలిక ముందు తరాలకొక గుణపాఠం !
గుండెల్ని పిండేసే....ఈ ప్రకృతిప్రళయాలే !
ఈ విషవలయాలే...ఈ దుస్సంట్పఘటలే
