Facebook Twitter
కొండచరియలా కాదు కొండచిలువలు..!

ఔరా ఇది కనీవినీ ఎరుగని
విషాదమే...విషవలయమే..!
ప్రకృతి ప్రకోపిస్తే ప్రళయమే..!
మరుభూమిగా మారిన దేవభూమి..!
మృత్యువు మ్రోగించే మృదంగనాదం..!

అయ్యో
అందమైన అతిసుందరమైన
చూరాల్ మల ముండక్కై మెప్పాడ  కొండప్రాంతాల్లో ఎటుచూసినా
హృదయ విదారక దృశ్యాలే
కూలిపోయిన ఇళ్ళ శిధిలాలలో
గుట్టలు గుట్టలుగా కుళ్ళిన శవాలే..!

కుటుంబాలు కుటుంబాలు
జలసమాధి ఐపోయాయే..!
రక్త సంబంధాలన్ని
రాత్రికి రాత్రే రద్ధైపోయాయే..!
మరో సూర్యోదయం చూసే
భాగ్యం వారికి లేదాయె..!

శాశ్వతంగా
నిద్రలోకి జారిపోయారే..!
ఉప్పొంగిన నది ఉరిగా మారిందే..!
ఊపిరి తీసిందే...ఊళ్ళను మ్రింగేసిందే..!

ఎన్ని అమాయకపు
కుటుంబాలు కొండల నుండి
జారిన భారీ బండరాళ్ళకింద పడి
నలిగి నలిగి నుజ్జునుజ్జైపోయాయో..?

ఎంతమంది వృద్ధులు స్త్రీలు పిల్లలు
ఛిద్రమైపోయారో...? చితికి పోయారో....?
ఎందరు ఊపిరాడక ఉక్కిరిబిక్కిరై కన్నుమూసి మట్టిలో కలిసిపోయారో..?

బురదలో కూరుకుపోయారో..?
వరద ఉధృతికి కొట్టుకుపోయారో..?
ఎందరు ఆకస్మిక జలప్రళయానికి
బలైయైపోయారో ఎవరికెరుక...?

ఇదే అంతుచిక్కని విధి వ్రాత..!
300 లకు పైగా మృత్యు వాత..!
కనీవినీ ఎరుగని వరద భీభత్సం..!
ప్రకృతి ప్రళయం విధ్వంసం విషాదం..!
అవి కొండచరియలా కాదు కొండచిలువలు