శ్రమించే వాడికే...
శపించే హక్కుంది
శ్రమ దోపిడి చేస్తే...
ప్రేమించే వారికే...
ద్వేషించే ఆ ప్రేమను
నిరాకరించే హక్కుంది
పాలకుండలాంటి ప్రేమలో
విషపు చుక్కలు రాలితే...
ప్రాణాలర్పించేలా
ప్రేమించిన వాడికే...
ప్రాణాలు తీసే హక్కుంది
నమ్మించి నట్టేట ముంచితే...
ప్రశ్నించే వారికే...
ప్రతిఘటించే హక్కుంది
ప్రశ్నలకు ప్రతిస్పందన లేకుంటే...
ప్రశ్నించే గొంతుల్నే నొక్కేస్తుంటే...
ప్రశ్నించే వారి ప్రాణాలకే ముప్పుంటే...
దుక్కి దున్నినోడికే...
విత్తు నాటినోడికే...
నారు పోసినోడికే...
నీరు పెట్టినోడికే...
పండిన పంటను నూర్చే హక్కుంది
రేయింబవళ్ళు రెక్కల్ ముక్కల్ జేసి
రక్తాన్ని స్వేదంగా చిందించినందుకే...
అడగక ఇచ్చినోడికే...
అడగకుండా పుచ్చుకునే హక్కుంది
ఆపద్భాంధవుడే ఆపదలో చిక్కుకుంటే...
ఆశించేవాడికే...
శాసించే హక్కుంది...
పాలకుల పాపం పండితే...
రాజ్యకాంక్షతో....రాక్షస పాలన సాగిస్తే...
ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేస్తే కూలదోస్తే..
