Facebook Twitter
ఆహ్వానించిన అసెంబ్లీ గేటు…

అదృష్టలక్ష్మి దీవించింది

విజయలక్ష్మీ వరించింది 

ఓట్ల కుంభవర్షం కురిసింది 

డిప్యూటీ సిఎం సీటు దక్కింది...ఎవరికి 

జననేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి...!

నేలకేసి బంతినెంత 

బలంగా కొడితే అంతే బలంగా 

ఆ బంతి పైకి లేస్తుందన్నట్లు...

బండ్లు ఓడలు 

ఓడలు బండ్లు ఔతాయన్నట్లు...

మనం ఒకటి తలంచితే 

ఆ దైవం మరొకటి తలంచినట్లు... 

కష్టేఫలి శ్రమయేవ జయతే అన్నట్లు...

రాజ్యాలు... 

రాజభోగాలు...

రాజమందిరాలు...

కనక సింహాసనాలు... 

ధగధగలాడే కీర్తి కిరీటాలు...

ఏవీ ఎవరికి శాశ్వతం కాదన్నట్లు...

నాది నాది అన్నదేదీ నీదికాదన్నట్లు...

మూలిగేనక్క మీద తాటికాయ పడ్డట్లు...

ప్రపంచం ఔనన్నా కాదన్నా...ప్రజలు 

పరమాత్మ తోడుంటే చాలన్నట్లు...

తంతే ఒకడు గారెల బుట్టలో పడ్డట్టు...

ఆ ఒక్కడు కింగ్ మేకర్ జనసైనికుడు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నట్లు...

కృషి ఉంటే... 

మనుషులు 

ఋషులౌతారు...

మహాపురుషులౌతారన్నట్లు...

కసి కృషి పట్టుదలే ఉంటే 

పవర్ స్టార్ డిప్యూటీ సిఎంకావొచ్చు...

అసెంబ్లీ గేటు ఆహ్వానం పలకవచ్చు....