పవర్ స్టారా... మజాకా..!
ముగ్గురు భార్యల
ముద్దుల మొగుడని...
ముసిముసి నవ్వులు నవ్వినా
నీలాపనిందలెన్ని వేసినా...
ఎంతగా ఎగతాళి చేసినా...
పవర్ స్టార్ కాదు ప్యాకేజీ స్టారన్నా
ఘోరమైన అవమానాలకు గురిచేసినా
పోటీ చేసిన రెండు స్థానాల్లో
ఘోరంగా ఓడిన జనసైనికున్ని
అసెంబ్లీ గేటు సైతం తాకలేవన్నా...
పదేళ్ళు పట్టువదలని విక్రమార్కుడిలా
వారాహి నెక్కి వరాలు కురిపిస్తూ...
ప్రజలను రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తూ
ప్రత్యర్థులకి ముచ్చెమటలు పట్టిస్తూ...
పోటీ చేసిన 2 పార్లమెంటు స్థానాలు
21 అసెంబ్లీ స్థానాలు కౌవశం చేసుకొని
అఖండ మేజారీటీతో ఆంధ్రాఎన్నికల్లో
విజయఢంకా మ్రోగించి కింగ్ మేకరై...
అసెంబ్లీలో అడుగు పెట్టి ఏకంగా
డిప్యూటీ సిఎం సీట్లోనే సింహంలా
కూర్చున్న గబ్బర్ సింగ్ యువనేత
మన జన సేనాని పవర్ స్టారా...మజాకా...
జయహో జయహో పవర్ స్టార్ జయహో



