Facebook Twitter
ప్రజాస్వామ్యమా నీవెక్కడ...?

ఔను 

ప్రజల చేత

ప్రజల కొరకు

ప్రజలే ఎన్నుకున్న 

ప్రభుత్వ విధానమే...

ప్రజల వద్దకు పాలనే 

ప్రజాస్వామ్యమన్నారు...అమెరికా 

మాజీ అధ్యక్షులు అబ్రహాం లింకన్

అట్టి ప్రజాస్వామ్యానికి 

రాజ్యాంగమే రక్షణ కవచం అన్నారు

అపరమేధావి డాక్టర్ బి ఆర్ అంబేద్కర్

ఆ రాజ్యాంగ సూత్రాలే 

స్ఫూర్తిగా ఎన్నికైన పాలక ప్రభువులకు 

ప్రజా సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళు 

కావాలన్నారు...మనజాతిపిత బాపూజీ...

 

పాలకులెవరైనా అధికారముందని 

అహంకారంతో పార్టీలను చీల్చడం... 

ప్రభుత్వాలను కూల్చడం... 

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే...

ప్రశ్నించే గొంతుకల్ని 

ధిక్కార స్వరాలను నొక్కడం...

కలాలకు సంకెళ్ళు వేసి అసహనంతో

కవులను కటకటాల్లోకి నెట్టడం... 

రాచరికపు జిత్తులతోఎత్తులతో 

రాజ్యాంగాన్ని మార్చాలనుకోవడం...

నిరంకుశ పాలనకు నిలువెత్తు నిదర్శనమే. 

పచ్చని ప్రజాస్వామ్య పంట పొలంలో 

కంటకులైన పాలకులు కలుపుమొక్కలే...

ఎటుచూసినా కులమతాల కుమ్ములాట...

కుళ్ళిపోతోంది ప్రజాస్వామ్యపు పూలతోట

అందుకే 

ఎప్పుడైనా ఏక్కడైనా ప్రారంభిస్తే 

ప్రజా నాయకులు ...ఓట్లవేట...

సుపరిపాలనందించే 

సుచరితగల నిస్వార్థపరులైన... 

నాయకుల్ని...ఎన్నుకునేందుకు...

ప్రజలంతా సంధించాలి...ఓట్లతూటా...

ఇక చెల్లదు చెల్లదు 

ప్రజాస్వామ్యంలో రాక్షస పాలన... 

ప్రజాస్వామ్య పరిరక్షణే... 

ప్రతి వ్యక్తి ప్రథమ కర్తవ్యం..

కాదిది...వేమన్న చెప్పిన వేదం...

కావాలిదే ప్రతిభారతీయుని నిత్యనినాదం

చివరిగా ఒక ప్రశ్న: 

ప్రజాస్వామ్యమా నీవెక్కడ..?

సమాధానం: 

సామ్యవాదుల గుండెల్లో నేనక్కడ..! అందుకే ఓ సాహితీ సామ్యవాదులారా..!

మీ కలాలకు పదును పెట్టండి...

తల్లి భరతమాతకు హారతి పట్టండి...

పటిష్టమైన ప్రజాస్వామ్యానికి పట్టం కట్టండి...