పంచభూతాలు పగబట్టాయా..?
కోట్లమంది ఓటర్లు...
కోళ్ళై కూస్తున్నారు...
విస్తుపోయి చూస్తున్నారు...
మా ఓట్లు ఏమయ్యాయని...
పని చేసిన ప్రభుత్వానికి
ఏమిటీ ఘోర పరాజయమని...
ఇది నమ్మశక్యంగా లేదని...నిజానికి
ప్రజలు పార్టీని గెలిపించారని...
కానీ అదృశ్యంగా అనైతికంగా
అతి రహస్యంగా ఏవో కొన్ని
దుష్టశక్తులు ఏకమై ఓడించాయని...
151 సీట్లలో మధ్యలోని
పంచభూతాలు పగబట్టాయా..?
అటు 1 ఇటు 1 కలిసి 11 మిగిలిందే...
ఇదేమి ఘోరం..?
ఎక్కడుంది లోపం..?ఇదెంతటి
విధి వైపరీత్యం... కలనోనైనా
ఊహించని కరెంట్ షాక్ తగిలిందే...
ఇదెవరి శాపం...
ప్రతిపక్ష హోదా సైతం దూరమైందే...
ప్రజాసంక్షేమం కోసం తపించడం
ప్రజా శ్రేయస్సును కాంక్షించడం
మేం చేసిన పాపమా...



