ఈ రక్త చరిత్ర
ఏ సిరాతో వ్రాసిందో...
ఈ ప్రజా తీర్పు
ఓర్పు నశించిన
ఏ ఓటర్లిచ్చిందో...
అయ్యో..!ఓ దైవమా..!
ఏమిటిది...? ఇంతటి ఘోరమా..?
ఇంతటి దారుణమా..?
ఇంతటి ఘోర పరాజయమా..?
ప్రజాసంక్షేమాన్ని...ప్రజాశ్రేయస్సును
కాంక్షించడం మేం చేసిన మహా నేరమా..?
అయ్యో..! ఓ దైవమా..?
ఏమీ జరిగింది..? ఇది ఎవరి శాపం..?
ఎక్కడుంది లోపం..?
ఏంటి మేం చేసిన మహాపాపం..?
అయ్యో..! ఓ దైవమా..?
ఇదేమి వింత తీర్పు...?
కాదు కాదిది ప్రజలిచ్చిన తీర్పు
ఎక్కడో జరిగింది ఎదో కుట్ర..?
ఖచ్చితంగా ఓటమి తప్పదని
కుమిలిపోయే అభ్యర్థులకు
కళ్ళుతిరిగే భారీ మేజారిటీలా..?
గతంలో రెండుచోట్ల ఓడిన నేత
21 సీట్లకు పోటీ చేసి
21 సీట్లు గెలవడమా..?
లేదు లేదు ఎక్కడో జరిగింది ఎదో కుట్ర
గుండెల్లో గుపాలుగుచ్చే ఈ తీర్పు
ఎవరిచ్చిన తీర్పు...?
మేధావుల అంచనాలకందని ఈ తీర్పు
ఎవరిచ్చిన తీర్పు ...?
ఇది ప్రజాతీర్పా లేక లలాట లిఖితమా..?
అయ్యో ఓ దైవమా..! ఎంతకూ
అర్థం కాకున్నదే ఇది ఎవరిచ్చిన తీర్పు...?



