1...
నవరత్నాల పథకాలు
నవగ్రహాలై ఆగ్రహించినట్లు...
శనిదేవతలై శపించినట్లు.....
తానొకటి తలంచిన
ఆ దైవం మరొకటి
తలంచినట్లు..
మాయా వేషంలో వచ్చి
కవచకుండలాలు దొంగిలించి...
కర్ణున్ని ఓడించినట్లు...
దిగ్భ్రాంతికరమైన అంతుచిక్కని
ఆంధ్రా ఎన్నికల ఫలితాలకు
బలమైన కారణాలు...9...
మొదటిది...
21 రోజుల్లో విహార యాత్రలపేర విదేశాలకెళ్ళి అంతర్జాతీయంగా అంతర్జాలంలో డేటా హ్యాకర్లతో
కుమ్మక్కై కొందరు పన్నిన కుట్రలకు
కుతంత్రాలకు ఈవియంల్లోని రిజల్ట్స్ తారుమారయ్యాయా...?జాతకాలే
మారి మంత్రులంతా మట్టికరిచారా..?
రెండవది...
చాపకింద నీరులా
ఉద్యోగుల్లో నిరుద్యోగుల్లో
గూడు కట్టుకున్న
నిరాశ నిస్పృహలు
నిట్టూర్పులు నిశ్శబ్దంగా
విప్లవశంఖారావం పూరించాయా..?
ఓట్ల సునామీని సృష్టించాయా..?
2...
మూడవది...
బలమైన రెండు
సామాజికవర్గాల
ఐక్యతే కొంప ముంచిందా...
86 సీట్లలో చేసిన భారీమార్పులకు
నిరసనగా సొంత సామాజిక వర్గమే సైలెంట్ గా తిరుగుబాటు చేసిందా...?
పోలింగ్ బూతుల్లో సీక్రెట్ గా
ఓటు ట్రాన్సఫర్ చేసిందా..?
నాలుగవది...
అక్కడ
కుటుంబమంతా
ప్రచారంలో పాల్గొంటే
ఇక్కడ కుటుంబంలో కూటమి
రేపిన చిచ్చుకు దారుణంగా
పార్టీ దహించుకు పోయిందా..?
ఐదవది...
ఐదేళ్ళపాటు...ఉదృతంగా
అమరావతిలో సాగిన
మూడు రాజధానుల ఉద్యమంలో
చెలరేగిన ఆరని అగ్నిజ్వాలలకు
పార్టీ ప్రతిష్ట ఆహుతై పోయిందా...?
3...
ఆరవది...
ఆవగింజంత...
అవినీతికైనా తావులేకుండా
అక్కా చెల్లెమ్మల బ్యాంకు ఖాతాలకు నేరుగా కోట్లు కోట్లు జమ చేసినందుకు
ఆదాయం కోల్పోయిన అస్మదీయులే...
అసంతృప్తితో ప్లేట్ ఫిరాయించారా..?
కోలుకోలేని దొంగదెబ్బ తీశారా ..?
ఏడవది...
90 శాతం...
నవరాత్నాల అమలులో
అభివృద్ధి జీరో సంక్షేమం హీరో
ఐనందుకు ఆఖరి నిమిషంలో
పేద అమాయకపు మధ్యతరగతి
ప్రజలు మనసు మార్చుకున్నారా..? మార్పుకోరుకున్నారా..?
ఎనిమిదవది...
పేదలకు...
పెత్తందార్లకి జరిగిన
ఈ ఎన్నికల రణక్షేత్రంలో
కసితో పెత్తందార్లు కాలసర్పాలై
చాటుమాటుగా కాటువేశారా...?
ప్రభుత్వాన్ని కూల్చి వేశారా...?
తొమ్మిదవది...
బలమైన ప్రభుత్వం
బలహీనుల చేతిలో ఉందంటారు
అట్టి బలహీనులు తమ
బలహీనతలకు తామే బలైపోయారా..?
కోట్లు పోసి పేదల ఓట్లను కొందామన్న
ఎన్ఆర్ఐల ప్రలోభాలకు లొంగిపోయారా?
ఓ దైవమా..! ఈ గుట్టు
విప్పేదెవరు? అసలు నిజం చెప్పేదెవరు..?



