Facebook Twitter
గుణపాఠం...అధికార పీఠం..?

నైజీరియా 

సైబర్ నేరగాళ్లు 

బ్యాంకు ఖాతాల్ని 

హ్యాక్ చేసి ఆపై 

క్షణాల్లో దాచుకున్న 

లక్షలు దోచేసుకున్నట్లు...

సాంకేతికంగా నిపుణులైన... 

సింగపూర్ సాప్ట్వేర్ ఇంజనీర్లు

స్ట్రాంగ్ రూంల్లోని ఈవీయంలను 

హ్యాక్ చేసి డేటాను మార్చి పార్టీల ఫలితాల్ని తారుమారు చేశారా అన్నట్లు... 

కోట్లు పోసి పేదల ఓట్లను కొందామన్న

NRIలు డేటా హ్యాకర్లను కొన్నారా అన్నట్లు

 

యావద్భారతావనిని దిగ్బ్రాంతికి

గురిచేస్తోంది ప్రకంపనలు పుట్టిస్తోంది 

సెఫాలజిస్టుల అంచనాలకు మించి

ఆంధ్రా ఓటర్లిచ్చిన...చారిత్రాత్మకమైన

సంచలనాత్మకమైన...అనూహ్యమైన... ఆశ్చర్యకరమైన...ఈ అంతిమ తీర్పు...

ఓటమికి సిద్దమైన అభ్యర్థులే తమ

భారీమెజారిటీలు చూసి బిత్తరపోవడం

ఓటర్లలో కోటి సందేహాలను రేకెత్తిస్తోంది.?

పార్టీలు రెండు పోటీపడి 

హోరాహోరీగా పోరాడినా...

వార్ వన్ సైడ్ ఐపోయింది...

ఒక పార్టీ...ఫలితం 

ఆకాశంలోకి 

దూసుకెళ్ళిన తారాజువ్వ..! 

ఒక పార్టీ...ఫలితం 

తుస్సుమన్న చిచ్చుబుడ్డి..! 

ఒక పార్టీకి...అఖండ 

మెజారిటీతో కీర్తి కిరీటం..! 

ఒక పార్టీకి...అతిఘోర పరాజయం..!

ఒక పార్టీకి...దక్కింది అధికార పీఠం..!

ఒక పార్టీకిది గుర్తుండిపోయే గుణపాఠం..