ఎంతో ప్రసిద్ధి చెందిన
ఎన్ని విద్యా సంస్థలున్ననేమి..?
విద్యార్థులు పరీక్షలెలా వ్రాస్తేనేమి..?
అన్ని స్టేట్ ఫస్ట్ ర్యాంకులు
ఒక్క విద్యాసంస్థకే వొచ్చునట..!
ఎంతటి వింతైనా జరిగేనట...నా దేశంలో
ఎన్ని టన్నులున్ననేమి..?
ఏనుగులు ఎగరా వచ్చునట..!
ఎవరెస్టు శిఖరం ఎక్కనూ వచ్చునట..!
ఎంతటి వింతైనా జరిగేనట...నా దేశంలో
కర్రలతో కత్తులు కటారులతో
మారణాయుధాలతో నడిరోడ్డులో గుండాలు దారుణంగా దాడులకు
తెగబడి విచ్చలవిడిగా విధ్వంసం సృష్టిస్తున్నా...ప్రేక్షకపాత్ర వహించే
పోలీసు వ్యవస్థను...ప్రభావితంచేసే
ప్రతిభావంతులున్న దేశం...నాదేశం...
ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యాక
పోస్టల్ బ్యాలెట్ ఓట్ల నిబంధనల్ని మార్చేలా...ఎన్నికల అధికారుల్ని...
అత్యున్నత న్యాయస్థానం తీర్పుల్ని... మేనేజ్ చేసే మేధావులున్న దేశం...నాదేశం
ఉరుమే ఉరుములను...
మెరిసే మెరుపులను...కురిసే
మేఘాలను సైతం మేనేజ్ చేయగల...
కుట్రలకు కుతంత్రాలకు మారుపేరైన
మహా నాయకులున్న దేశం...నాదేశం...
అందుకే అన్నపూర్ణ
నా దేశం నమో నమామి...
ఆసేతు హిమాచలం ఆశ్చర్యపోయే
ఆంధ్రా ఓటర్ల విచిత్రమైన...విలక్షణమైన సంచలనాత్మకమైన తీర్పు సదాస్మరామి



