Facebook Twitter
ఔరా ఇదేమి నీతి...?

ఇదేమి నీతి...? 

ఇదెక్కడి ధర్మం..?

ఇదేమి న్యాయం...? 

మన పవిత్ర గ్రంధాలైన

బైబిల్ భగవద్గీత ఖురాన్ లు 

ఏమని బోధిస్తున్నాయి..?

ఏమని హెచ్చరిస్తున్నాయి...? 

కన్నతల్లి గర్భం నుండి 

ఖాళీచేతులతో వచ్చాం 

కన్నుమూసి ఆ 

భూగర్భంలోకి ఖాళీచేతుల్తోవెళ్తాం

అన్నీ నావేననే 

భ్రమతో బ్రతికి లాభమేమి..

ఆశపడి  ఆర్జించిన ఆస్తులేవి

చేతపట్టుకుపోలేం 

మూట కట్టుకుపోయి 

సమాధిలో పెట్టుకోలేచ్చినిజం...

కానీ నేడు రాజకీయ 

రణక్షేత్రంలో  

పేదల పాంటీ 

ధైర్యంగా 

పోటీపడి పచ్చనోట్లు 

పంచేది ఓట్లకోసమే

కోట్లు కోట్లు ఖర్చు 

చేసేది గెలుపు కోసమే 

ప్రత్యర్ధులపై భారీమెజారిటీతో గెలిచి 

శాసన సభల్లో అడుగు పెట్టేందుకే... 

ఏదో ఒక అధికార పదవిని అనుభవించేందుకే... 

రానున్న ఎన్నికల్లో 

తిరిగి పోటీచేసేందుకే...

తరతరాలకు తరగని 

లెక్కపెట్టే లేనన్ని 

ఆస్తులు అంతస్తులకోసమే

కోట్లు కోట్లు ఆర్జించడం కోసమే...