Facebook Twitter
నరాలు తెగే ఉత్కంఠ...?

ఒకరు మీసం 

రువ్వుతువుంటే...

అతి విశ్వాసంతో...

 

ఒకరు 

దగ్దమైపోతున్నారు...

భరించలేని సందిగ్దాగ్నిలో...

భద్రతా 

వలయంలో ఉన్న 

బ్యాలెట్ బాక్సులకు 

దూరంనుండే మ్రొక్కుతూ....

పొర్లుదండాలు పెడుతూ...

ఊపిరాడక ఉక్కిరిబిక్కిరైతూ...

నిరీక్షణ ఒక నిప్పుల వంతెనయని... 

నరాలు తెగే ఉత్కంఠ ఒక ఊబియని...

సర్వేల గుడ్డిగుర్రాలమీద స్వారీ చేస్తూ... 

తమ ఎన్నికల నావ 

విజయాల తీరం చేరేనో... 

నడిసంద్రాన మునిగిపోయేనో...

అర్థం కాక పాపం అభ్యర్థులందరూ అంచనాల అంధకారంలో...

గెలుపు ఓటమిల గందరగోళంలో...

క్షణమెక యుగంగా...

బ్రతుకు భయంగా 

భారంగా...  

నవ్వులు... 

ఏడ్పులు 

చింతలు...

చిరునవ్వులు... 

చీకటి వెలుగులు... 

దోబూచులాడుతూ...

పిశాచుల్లా భయపెడుతుంటే... 

దిక్కులు చూస్తూ... 

బిక్కుబిక్కు మంటూ... 

ఆ పరమాత్మను వేడుకున్నారు 

ఒక నగ్నసత్యాన్ని తెలుసుకున్నారు

అది జననమైనా...మరణమైనా... 

అది గెలుపైనా......ఓటమైనా...

అది వరమైనా......శాపమైనా... 

ప్రసాదించేది.........ఆ పరమాత్మేనని...