Facebook Twitter
అంతవరకు తప్పదు అంతర్మధనం..?

అభ్యర్థుల అదృష్టం

ఆ బ్యాలెట్ బాక్సుల్లో దాగిఉంది 

ఎవరికి విజయమో..? 

ఎవరికి అపజయమో..? అర్థంకాక 

ఎవరి జాతకాలు 

తారుమారయ్యాయో..?    

ఎవరి తలరాతలు 

అంచనాలు తలకిందులయ్యాయో..?

ఎవరిని విజయలక్ష్మి వరిస్తుందో..?

ఎవరికి రాజసింహాసనం దక్కనుందో..?

ఎవరు రాజకీయంగా 

శాశ్వతంగా సమాధి కాబోతున్నారో..?

ఎవరిని గజమాలలతో 

ఏనుగులపై గుర్రాలపై ఊరేగిస్తారో..?

ఎవరికి "గాడిదయోగం" పట్టిందో..?

ఎవరిని అందలం ఎక్కిస్తారో..?

ఎవరిని అగాధంలోకి నెట్టేస్తారో..?

ఆ బ్యాలెట్ బాక్సులు బద్దలైతే 

ఎవరి గుండెల్లో

అగ్నిపర్వతాలుబద్దలౌతాయో..?

ఎవరికెరుక..?

ఆ భగవంతుడికి...

ఆ బ్యాలెట్ బాక్స్ లకు...

ఒక్క సిరాచుక్కతో

నాయకుల తలరాతల్ని 

తారుమారు చేసి మునుల్లా 

మౌనంగా కూర్చున్న...ముసిముసి 

నవ్వులు నవ్వుతున్న ఆ ఓటర్లకు తప్ప...

ఔను రాజకీయ పదవులు 

ఆశించే అభ్యర్థులకు ఓటర్లు 

పెట్టింది...అగ్ని పరీక్షనో...

వేసింది...శిలువ శిక్షనో.‌..

ఆ సిరాచుక్క ఎవరికీ శ్రీరామరక్షనో... 

తెలిసేది జూన్ నాలుగునే...

అంతవరకు తప్పదులే అంతర్మధనం...