Facebook Twitter
జై పాతాళ భైరవి..!  ఇది తీర్పా..? కాదు ఓట్ల సునామి..!

నిరుపేదల ముఖాల్లో 

చిరునవ్వులు చూడాలని 

తలంచడం ఒక శాపమా...?

ఎందరో 

పెత్తందార్లు 

వ్యతిరేకించినా

ఎంతటి భారమైనా...

పేద విద్యార్థులకు బంగారు 

భవిష్యత్తునుఅందించాలని 

తపించడం ఒక నేరమా..? 

ఇంటికి దీపం ఇల్లాలని... 

అమ్మఒడి పేరుతో నేరుగా మహిళా మణుల ఖాతాలకు ఆర్థిక సహాయం అందజేయడం మేం చేసిన పాపమా...? 

ఓ దైవమా ఏమైంది 

ఎందుకిలా జరిగింది?

మా అభేధ్యమైన కోట పైకి 

ఎవరు విసిరారు ఓట్లబాంబులు

రెప్పపాటున మా కళ్ళముందే 

కుప్పకూలిపోయిందే మా సామ్రాజ్యం 

ఇది విధి నవ్విన విషపు నవ్వా...?

ఇది కాలం చేసిన ఇంద్రజాలమా...?  

ఇది అదృశ్యశక్తుల కుట్ర ఫలితమా...?

ఓ దైవమా ఏమైంది..? 

ఎందుకిలా జరిగింది..?

ఎంతకూ అర్థంకాకున్నదే 

ప్రజాకోర్టులో నా ఓటర్లిచ్చిన ఈ చారిత్రాత్మక సంచలనాత్మకమైన తీర్పు...

ఔరా ఇది తీర్పా..? కాదు ఓట్ల సునామి..!