1...
జై పాతాళ భైరవి..!
బాలకా..! ఏమిరా నీ కోరిక..!
తల్లీ నాకేల ఈ ఘోర పరాజయం..?
ఔను తప్పు నీదేరా బాలకా..!
ఇది ఐదేళ్ళ పాపంరా..! పరిష్కారం
కాని మూడు రాజధానుల ముప్పురా..!
అదే నిన్ను నిలువున దహించిన నిప్పురా
ఉద్యోగులందరి ఉసురు నీకు తగిలిందిరా
కూటమి నీకుటుంబంలో చిచ్చు పెట్టిందిరా
జై పాతాళ భైరవి..!
బాలకా..! ఏమిరా నీ కోరిక ..!
తల్లీ నా వాలంటీర్లను పంపి
నడవలేని నా అవ్వాతాతలకు
ఇంటి వద్దనే పెన్షన్ ఇప్పించానే....
అమ్మవొడి పేరుతో బటన్ నొక్కినొక్కి
నా అక్కాచెల్లెమ్మల ఖాతాలకు నేరుగా
లక్షల రూపాయలు జమ చేశానే...మరి
నా సంక్షేమ పథకాల...ప్రయోజనాలు
నా నవరత్నాల ఫలాలు...అందుకున్న
నా లబ్దిదారుల...
నా ఎస్సీల...
నా ఎస్టీల...
నా బీసీల...
నా మైనారిటీల...
నా క్రిష్టియన్ ల...
నా అక్కాచెల్లెమ్మల...
నా అవ్వాతాతల...లక్షల ఓట్లేమాయె?
నా సిద్దం సభలకు...
తేనెటీగల్లా...తరలి వచ్చిన...
కడలి తరంగాల్లా...కదలి వచ్చిన...
నా అభిమానుల...వీరాభిమానుల
నా కార్యకర్తల...లక్షల ఓట్లు ఏమాయె...?
నీ "ఆత్మ ఘోష" నిజమేనురా బాలకా..!
యుద్దానికి మేం సిద్ధం మీరు సిద్దమా అంటూ వినూత్నంగా భారీగా
బహిరంగ సభలు పెట్టి...
ఊర్లన్నీ తిరిగి ఉపన్యాసాలిచ్చి...
కుర్రకారును...ఉర్రూతలూగించి...
ఎర్రని ఎండల్లో రాష్ట్రమంతటా
సుడిగాలిలా చుట్టొచ్చావు...
సింహంలా సింగిల్ గా తిరిగావు...
ఓట్లకోసం...మెజారిటీ సీట్లకోసం
నీ అభ్యర్థుల గెలుపు కోసం...
స్వేదాన్ని చిందించావ్...
ధైర్యాన్ని అందించావ్...
పోలింగ్ ఐపోయాక...
ఆరాను ఆత్మసాక్షి సర్వేలను
ఇంటెలిజెన్స్ ఐపాక్ రిపోర్టులను
నమ్మి ఆశతో...ఆత్మవిశ్వాసంతో...
అతిధీమాతో...లండన్ కు వేళ్ళావాయె...
ఇక్కడ...పాము కప్పల్లా
పిల్లీ ఎలుకల్లా నిత్యం పోట్లాడే ఆ
మూడు పార్టీలు అనౌతిక పొత్తులు పెట్టుకొని ఎన్నో ఎత్తులు వేస్తూఉంటే...
అక్కడ...నీవు లండన్
పురవీధుల్లో విహరిస్తూ...హాయిగా
విశ్రాంతి తీసుకుంటున్నావాయె...
ఇక్కడ నీకు పట్టున్న
నియోజకవర్గాల మీద
నిఘా పెట్టి నీ ఓట్లనే కాదు
నీ సీట్లను సైతం కొల్లగొట్టేందుకు...
నీ పార్టీని భూస్థాపితం చేసేందుకు...
ఎత్తులకు పైఎత్తులు వేస్తూ ఉంటే...
కత్తులు నూరుతూ ఉంటే...
అక్కడ...నీవు లండన్లో
మళ్లీ నేనే సింయం నంటూ
పగటి కలలు కంటూన్నావాయె....
ఇక్కడ...నిన్ను చిత్తు
చిత్తుగా ఓడించేందుకు
కష్టపడి కసరత్తులు చేస్తూ...
అన్ని మార్గాలను అన్వేషిస్తూ...
అన్ని వ్యవస్థలను మేనేజ్ చేస్తూ...
కలిసి కుట్రలు కుతంత్రాలు పన్నుతుంటే...
అక్కడ...నీవు లండన్లో హాయిగా
ప్రశాంతంగా...నిద్రపోతున్నావాయె...



