Facebook Twitter
ఆంధ్రా ఓటర్లా...మజాకా...?

ఔరా..! ఔరా..!

ఇదేమి ప్రజా తీర్పు...? 

ఇదేమి ప్రభంజనం....?

వార్ వన్ సైడే...

హోరుగాలి ఒక వైపే... 

నమ్మశక్యం గాకున్నదే..!

ఇది ఏ పాపానికి ప్రతిఫలం..?

ఇదెవరి శాపం? ఎక్కడుంది లోపం..?

ఔరా ఆంధ్రా ఓటర్లా మజాకా 

దిమ్మతిరిగేలా కొట్టారు ఓటుదెబ్బ 

కళ్ళు తిరిగి మైండ్ బ్లాక్ అయ్యేలా...

అనుభవగ్నులైన...తలలు 

పండిన రాజకీయ నాయకులు 

మేధావులు సైతం నోరెళ్ళబెట్టేలా...

ఇచ్చిన ఓటర్లే బిత్తరపోయేలా..ఉన్నదే!

అనూహ్యమైన ఈ ప్రజా తీర్పు...!

ఆరా ఆత్మసాక్షి సర్వేలకు...

వేణు స్వామి జోస్యానికి...

అందరి అంచనాలకు భిన్నంగా 

అందనంత...ఎత్తుగా..మాయగా 

మత్తుగా...గమ్మత్తుగా...ఉన్నదే..!

అనూహ్యమైన ఈ ప్రజా తీర్పు...!

కాళ్ళక్రింద భూమి కదిలిపోయేలా..!

ఏ ఉరుములు మెరుపులు లేకుండా

సైలెంట్ గా ఒక్కసారిగా ఓ వెయ్యి 

పిడుగులు నెత్తినపడినట్టుగా...ఉన్నదే

అనూహ్యమైన ఈ ప్రజా తీర్పు...!

ఏమైంది..?

ఎందుకిలా జరిగింది..? 

మాకు తెలియాలి 

అంటున్నారు ఆశ్చర్యంలో 

మునిగితేలే ఆంధ్రా ఓటర్లు..!

 

మే 13...తరువాత 

జూన్ 4 కు...ముందు 

ఏం మాయ జరిగిందో ఏమో 

ఎవరికి అర్థం కాకున్నదే...

ఎంతో వింతగా విచిత్రంగా ఉన్నదే... 

నిన్నటి వరకు నరాలు తెగే ఉత్కంఠ... 

నేడు ప్రకంపనలు పుట్టిస్తున్న ప్రజాతీర్పు... 

ఏ‌ సెఫాలజిస్టుల

అంచనాలకు సైతం అందక 

అకస్మాత్తుగా ఆంధ్రలో 

అల్పపీడనం ఏర్పడింది 

అది తీవ్రతుఫానుగా 

మారింది తీరం దాటింది 

మేఘాలనే మేనేజ్ చేసినట్టుగా

కూటమి నియోజకవర్గ పొలాల్లోనే 

ఓట్ల "కుంభవర్షం" కురిసింది 

కూటమి మురిసింది... 

చంద్రునికి మళ్ళీ పవర్ దక్కింది 

ఒక పవర్ స్టార్ తళుక్కున మెరిసింది...

అభివృద్ధికి ఆమడ దూరంగా 

సంక్షేమ పథకాలే ఆయువుపట్టుగా 

సాగిన ప్రభుత్వం పేకమేడలా

రెప్పపాటున కుప్పకూలిపోయింది...

మంత్రులు మర్రివృక్షాల్లా నేలకొరిగారు

కూటమి ఒక సునామీని సృష్టించింది

నిన్న కూటమికి ఓటమి తప్పదన్నారు 

కూటమి కుప్పకూలిపోతుందన్నారు

మళ్లీ వచ్చేది మేమే...

ఓట్ల యుద్దానికి మేం సిద్ధం మీరు సిద్ధమా అంటూ సవాల్ విసిరిన నాయకుల 

అతివిశ్వాసాన్ని ఆత్మ విశ్వాసాన్ని 

కొండంతా ధీమాను నుజ్జునుజ్జు జేసి...

ఆంధ్రా ఓటర్లిచ్చిన 

ఈ విలక్షణమైన తీర్పు... 

అఖండ భారతావనినే ఆశ్చర్యంలో 

ముంచెత్తిన విచిత్రమైన తీర్పు... 

విశ్వాన్నే విస్మయపరచిన వింత తీర్పు...

గతఎన్నికల్లో ఖచ్చితమైన ఫలితాలనందించిన అనుభవమున్న ఆంధ్ర సెఫాలజిస్టులైన ఆరా ఆత్మసాక్షి అంచనాలన్నీ తారుమారాయె..?

వేణు స్వామి చెప్పిన జోస్యం...

ఎందరో పేరున్న ప్రముఖరాజకీయ విశ్లేషకుల లెక్కలన్నీ కాకిలెక్కలాయె..?

ఆహా ఔరా 

ఏమీ ప్రజాతీర్పు...? 

ఆంధ్రా ఓటర్లిచ్చిన   

విచిత్రమైన విలక్షణమైన 

సంచలనాత్మకమైన చారిత్రాత్మకమైన  

విశ్వాన్నే విస్మయపరచిన వింత తీర్పు..!