Facebook Twitter
రేపటి వెలుగు కోసం..!

రేపు నిన్ను

కరవకూడదంటే 

ఏ...కులం గజ్జి కుక్క... 

రేపు నిన్ను నమ్మించి 

నట్టేట ముంచకూడదంటే 

నవ్వుతూ ఏ...గుంట నక్క...

రేపు రాలకూడదంటే...

నీకంట ఓ...కన్నీటి చుక్క... 

రేపు కావాలంటే నీ బ్రతుకు  

ఏపుగా పెరిగే ఓ...పచ్చని మొక్క...

అమ్ముడు 

పోరాదంటే సారాచుక్కకు  

నీ చూపుడు వేలు సిరాచక్క... 

అన్నా...ఓ ఓటరన్నా... 

తెలుసుకో ఒక పచ్చినిజం 

నీ బ్రతుకు బాటను

బంగారుమయం చేసేది నీ ఓటేనని...

అది నీ చేతిలో ఓ వజ్రాయుధమని...

అన్నా...ఓ ఓటరన్నా... 

తెలుసుకో ఒక పచ్చినిజం 

అంతా నీలోనే...నీ చేతుల్లోనే...

నీ చేతల్లోనే...నీ ఆలోచనల్లోనే... 

నీవు తీసుకునే...నిర్ణయంలోనే...

నీవు విజ్ఞతతో వేసే నీ ఓటులోనే ఉంది 

రేపటి నీ బ్రతుకు... స్వర్గమైనా...నరకమైనా...

ముళ్ళబాటైనా...పూలబాటైనా...

చిమ్మచీకటైనా...వెన్నెలవెలుగైనా...