అన్నా..! ఓ ఓటరన్నా..!
అన్నా..! ఓ ఓటరన్నా..!
నీ చేతిలో ఉన్నది ఓటు...
కాదు...అది వజ్రవైడూర్యాలకన్నా
కోహినూర్ వజ్రం కన్నా విలువైనది
అన్నా..! ఓ ఓటరన్నా..!
నీ చేతిలో ఉన్నది ఓటు...
కాదు...అది ఒక వజ్రాయుధం...
అది అత్యంత శక్తివంతమైనది...
అన్నా..! ఓ ఓటరన్నా..!
నీ చేతిలో ఉన్నది ఓటు...
కాదు...అది అంబేద్కర్
నీకందించిన...ఒక గండ్రగొడ్డలి...
నేతల తలల్ని తలరాతల్ని మార్చవచ్చు
అన్నా..! ఓ ఓటరన్నా..!
నీ చేతిలో ఉన్నది ఓటు...
కాదు...అది ఒక మంత్రదండం...
బ్రహ్మ రహస్యంగా వ్రాసిన
రాజకీయ నాయకుల జాతకాలను
ఒక్కరాత్రిలో తారుమారు చేయవచ్చు



