ఓటర్లంటే...
బిక్షగాళ్లు కాదని...
నేతల తలరాతలు
వ్రాసే బ్రహ్మదేవుళ్ళని...
ఓటర్లంటే...
అవసరమైతే
అందలమెఎక్కిస్తారని...
మోసం చేసే దోచుకునే దొంగల్ని
అధఃపాతాళానికి అణగద్రొక్కుతారని...
ఓటర్లంటే...
నిస్వార్థంతో...
నిత్యం ప్రజాసేవలో...
నిమగ్నమయ్యే వారిని
ప్రత్యక్ష దైవాలుగా ఆరాధిస్తారని...
ఐదేళ్ళకోసారి దర్శనమిచ్చే...
వాగ్దానాల వర్షం కురిపించే...
ప్రజాసమస్యలు పట్టించుకోని
బడానాయకుల భారతం పడతారని...
ఓటర్లంటే...
అమాయకులు కాదని...
తలలు పండిన నాయకుల్ని
సైతం మట్టి కరిపించే మాంత్రికులని...
ఓట్లకోసం...
భారీ మెజారిటీకోసం...
ప్రత్యర్ధి పై గెలుపు కోసం...
ఎన్నో కలలుకంటూ ఎన్నికల బరిలో
దిగిన అభ్యర్థులందరికి...అర్థం కావాలి...!
అర్థమైంది..అందుకే ఓటరు దేవుళ్ళారా..!
మీకు వందనాలు..! పాదాభివందనాలు..!
మిత్రమా!
కవి కృషీవలా!
మొన్న శృంగార కవిత
వ్రాసి అలరించావు...
నిన్న ప్రేమకవిత వ్రాసి
యువతులను
వారి తల్లిదండ్రులను
జాగృత పరచావు...
నేడు ఓటరు కవిత వ్రాసి
ఓటర్లను హెచ్చరించావు...
మహాకవి శ్రీశ్రీపై కవితలు వ్రాసి
నీరాజనాలు అర్పించావు...
నీ కవితలు వేయి పడగలు
నీవు సహస్ర కవివి...
నీకు అభినందన చందనాలు.
అయ్యా ఓ పోలయ్యా కవీ !
నీతో ఎవరూ సరిపోలరయ్యా!
గేదెల హేమా చలం గారు
హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి
బరంపురం...ఒరిస్సా స్టేట్...



