Facebook Twitter
అన్నా..! ఓ ఓటరన్నా..!

అన్నా..! ఓ ఓటరన్నా..! 

పచ్చని నోటు...నీ నీతినిజాయితీని

"కాటు వేసే కాలసర్పం"...కారాదు.

ఏ మందుకో ఏ మటన్ బిర్యానీకో

ఆశపడి ఓటును...అమ్ముకోకు...

ప్రశ్నించే హక్కును...కోల్పోకు...

బానిసవై ఐదేళ్లు ....బ్రతకబోకు... 

అన్నా..! ఓ ఓటరన్నా..! 

నీకు నచ్చిన వారికే 

"అధికార పీఠం"... దక్కాలి 

రామరాజ్యం...రావాలి  

ప్రజాస్వామ్యం...వర్ధిల్లాలి 

నీ సమస్యలు పరిష్కారం కావాలి

అందుకే అన్నా..! ఓ ఓటరన్నా..! 

విజ్ఞత ప్రదర్శించు...ప్రజాసేవకే

ప్రాణాలర్పించే ప్రజానాయకుల్ని ఎన్నుకో

నీవు ఓడరాదు..! నీ ఓటు ఓడిపోరాదు..!