Facebook Twitter
అయ్య బాబోయ్ వచ్చేస్తున్నాయ్..!

అయ్య బాబోయ్ వచ్చేస్తున్నాయట..! 

తేళ్ళు...తోడేళ్ళు...విషసర్పాలు... 

ఊసరవెల్లులు...బంగారు బల్లులు...

ఏమి వస్తేనేమోయ్..?

ఎవరు వస్తేనేమోయ్..? 

ఓ ఓటరన్నా..! నీకేటి భయం... 

నీ వ్రేలికి ఉందిగా..."సుదర్శన చక్రం"

నీ భుజం మీద ఉందిగా..."గండ్రగొట్టలి"

నీ అరచేతిలో ఉందిగా..."అణుబాంబు" 

నీ వ్రేలిమీద వేసే సిరాచుక్కలో ఉందిగా...

ఓటనే "వజ్రాయుధం"... 

నీ హక్కుల అంబుల పొదిలో ఉందిగా... 

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి .ఆర్.

అంబేద్కర్ అందించిన..."రామబాణం"...

ఆ రామబాణాన్ని సంధించు...

రాక్షస రాజకీయరావణాసురులను

కారడవులకు పంపించు...

పేదలంటే ప్రేమ జాలి కరుణ దయ 

కలిగి నిస్వార్థంగా నిరంతరం 

అందరికీ అందుబాటులో ఉండే 

ఆపద్బాంధవుల్లా ఆపదలో ఆదుకునే

నీ కష్టాలు తీర్చే నీ కన్నీళ్లు తుడిచే 

రామన్నలను గెలిపించు...

రామరాజ్యాన్ని స్థాపించు...

ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించు...

అందుకే అన్నా..! ఓ ఓటరన్నా..! 

నీవు ఓడరాదు..! నీ ఓటు ఓడపోరాదు..!