వచ్చేస్తున్నారు..? వచ్చేస్తున్నారు...?
అయ్య బాబోయ్
వచ్చేస్తున్నారు..!
వచ్చేస్తున్నారు..!
మేకవన్య పులులు...
తేనె పూసిన కత్తులు...
మాటల మాంత్రికులు...
అరచేతుల్లో స్వర్గాన్ని
చూపించే అబద్దాలకోరులు...
ఏమి వస్తేనేమోయ్..?
ఎవరు వస్తేనేమోయ్..?
ఓ ఓటరన్నా..! నీకేటి భయం...
కానీ ఓ ఓటరన్నా..!
నీతిమంతులను...
నిస్వార్థపరులను...
సేవాతత్పరులను...
పరమాత్మ స్వరూపులను...
ఘనులను త్యాగధనులను...
ఆపదలో ఆదుకునే
ఆత్మబంధువులను...
సమస్యలకు స్పందించే
సహృదయులైన...
నేతలను గెలిపించాలి
నీవు గెలవాలి
అందుకే అన్నా..!
ఓ ఓటరన్నా..!
నీవు ఓడరాదు..!
నీ ఓటు ఓడపోరాదు..!



