Facebook Twitter
ఓటరన్నా నీ కేటి భయం...?

ఏమి వస్తేనేమోయ్..?
ఎవరు వస్తేనేమోయ్..?
ఓ ఓటరన్నా..! నీకేటి భయం...

నీ వ్రేలికి ఉందిగా
..."సుదర్శన చక్రం"

నీ భుజంపై ఉందిగా
..."గండ్రగొట్టలి"

నీ అరచేతిలో ఉందిగా
..."అణుబాంబు"

నీ వ్రేలికి వేసే
...సిరాచుక్కలో ఉందిగా...
ఓటనే "వజ్రాయుధం"...

నీ హక్కుల అంబులపొదిలో
...భద్రంగా ఉందిగా...
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి .ఆర్.
అంబేద్కర్ అందించిన..."రామబాణం"

వేసేయ్ నీ ఓటు
నిర్భయంగా...నిష్పక్షపాతంగా...స్వేచ్ఛగా
తోసెయ్ అథఃపాతాళానికి...
అహంకారపు నక్కల్ని అవినీతి జలగల్ని
అందించు అధికార పీఠాన్ని...
నిస్వార్థపరులకు నిజాయితీ‌గల నేతలకు